అల్లోపతి వైద్యం పై ఇటీవల యోగ గురువు రామ్ దేవ్ బాబా వివాదాస్పద వాక్యాలు చేశారు. ఆ వ్యాఖ్యలపై ఉత్తరాఖండ్ వైద్యు బృందం 1,000 కోట్ల రూపాయల పరువు నష్టం దావా వేసింది. 15 రోజుల్లోగా లిఖిత పూర్వకంగా క్షమాపణ చెప్పాలని, లేకపోతే వెయ్యి కోట్లు చెల్లించాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నోటీసులు పంపించింది.

దీనితో పాటు ఆయన పై సత్వర కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ కు లేఖ రాసింది. అల్లోపతి పనికిమాలిన వైద్యం అంటూ ఇటీవల రామ్ దేవ్ బాబా చేసిన వ్యాఖ్యల వీడియో గత వారం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో భారత్ వైద్య మండలి తో పాటు, కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

అల్లోపతి వైద్యం పై రామ్ దేవ్ బాబా వ్యాఖ్యలు అత్యంత దురదుష్టకరమని ఇది కరోనా యోధులను అవమానించడమే కాదు ఆరోగ్య కార్యకర్తల మనోధైర్యాన్ని కూడా దెబ్బతీస్తుందని హర్షవర్ధన్ ఆయనకు లేఖ రాశారు. దీంతో వెనక్కి తగ్గిన రామ్ దేవ్ బాబా తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నట్లు తెలిపారు. అన్ని రకాల వైద్యాలను తాను గౌరవిస్తానని చెప్పారు.

x