కరోనా వచ్చిందని బయపడుతుంటే అది మనిషిని సగం చంపేస్తుందని, అలాకాకుండా ధైర్యంగా దాన్ని ఎదురుకుంటే కరోనా ను ఖచ్చితంగా జయించవచ్చు అని ఎంతోమంది నిరూపించారు. అదే విషయాన్ని 102 ఏళ్ల బామ్మ చెబుతుంది.

గుంటూరు జిల్లా సిరిపురం కు చెందిన బామ్మ పేరు అన్నమ్మ ఆమె వయస్సు 102 సంవత్సరాలు. ఆమెకు 10 మంది సంతానం ఉన్నారు. 20 ఏళ్లక్రితం తన భర్త కృష్ణయ్య చనిపోవడంతో చిన్న కొడుకు కోటేశ్వరరావు వద్ద ఉంటుంది. అతడు ప్రైవేట్ హాస్పటల్ లో పని చేస్తున్నాడు. మూడు వారాల క్రితం అతనికి కరోనా పాజిటివ్ వచ్చింది.

అనుమానంతో తన తల్లికి కూడా టెస్ట్ చేస్తే కరోనా పాజిటివ్ గా తేలింది. ఆమెకు 102 ఏళ్లు వయసు ఉండటంతో ఏం జరుగుతుందో అని కోటేశ్వరరావు భయపడ్డాడు. కానీ ఆమెను హాస్పటల్లో రెండు వారాల పాటు వైద్యులు చెప్పినట్లు మందులు వాడింది అలాగే ఆ సమయంలో కుంగిపోకుండా ధైర్యంగా కూడా ఉంది. ఆ రెండు వారాల తరువాత తిరిగి టెస్ట్ చేయించగా నెగిటివ్ వచ్చింది.

ఆమె ఆరోగ్యంగా ఉండటం తో వైద్యులు ఇంటికి పంపించారు. తన తల్లి వైరస్ నుంచి కోలుకుంటుందని అసలు అనుకోలేదని, ధైర్యంగా ఎదుర్కొని వైరస్ ను జయించిందని ఆమె కొడుకు కోటేశ్వరరావు అంటున్నారు.

image source

x