పదో తరగతి పరీక్షల పై క్లారిటీ ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. విద్యార్థులకు నష్టం కలిగించకుండా, వారి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని కోవిడ్ నిబంధనలను పాటిస్తూ పరీక్షలు నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. దీనితో ఏపీలో టెన్త్ ఎగ్జామ్స్ యధావిధిగా జరగనున్నాయి. వీటితోపాటు ఇంటర్, డిగ్రీ, ఇంజనీరింగ్ పరీక్షలు కూడా యధావిధిగా జరగాలని ప్రభుత్వం సూచించింది.

రాష్ట్రంలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి, రోజుకి వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఒక పక్క విద్యార్థులు మరియు టీచర్లు కూడా కరోనా భారిన పడుతున్నారు. దీనితో విద్యార్థుల తల్లితండ్రులు పరీక్షలను రద్దు చేయాలనీ లేదా వాయిదా వేయాలంతు ఏపీ ప్రభుత్వాన్ని కోరుతున్నారు. పరీక్షలు నిర్వహిస్తే కేసులు మరింత పెరిగే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ సంగతి ఫై సీఎం జగన్ శుక్రవారం సమీక్ష నిర్వహించారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వారు నష్టపోకుండా పరీక్షలు నిర్వహించాలని ఆయన అధికారులతో అన్నారు. అన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాతే పరీక్షలు జరపాలని అధికారులను ఆదేశించారు సీఎం జగన్. ఒక పక్క తెలంగాణ ప్రభుత్వం 10th పరీక్షలు రద్దు చేసి విద్యార్థులను పాస్ చేసింది మరియు ఇంటర్ ఫస్టియర్ స్టూడేంట్స్ ను పై తరగతులకు ప్రమోట్ చేసింది.

x