మధ్యప్రదేశ్ లో ఒక విషాద ఘటన చోటుచేసుకుంది. ఒక బాలుడిని రక్షించేందుకు వెళ్లి దాదాపు 40 మందికి పైగా బావిలో పడిపోయారు. ఈ ప్రమాదంలో 11 మంది ప్రాణాలు కోల్పోగా.. మరికొంతమంది గాయాలతో బయటపడ్డారు.

పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం, మధ్యప్రదేశ్ లోని విదిష పట్టణానికి సమీపంలో గంజ్‌బసోడ గ్రామంలో ఈ విషాద ఘటన జరిగింది. ఒక బాలుడు గురువారం అర్థరాత్రి 9 గంటల సమయంలో ప్రమాదవశాత్తు తాగునీటి బావిలో పడిపోయాడు. ఆ బావి లోటు 50 అడుగులు మరియు దానిలో 20 అడుగుల వరకు నీరు ఉంది. అయితే, బావిలో బాలుడు పడిపోయాడన్న విషయం తెలియగానే స్థానికులు బావి వద్దకు చేరుకున్నారు. వారిలో కొంతమంది బావిలోకి దిగి బాలుడిని కాపాడే ప్రయత్నం చేశారు.

మిగిలిన వారు బావి పిట్టా గోడ పై నిలబడి వారికీ సహాయం చేస్తున్నారు. ఈ క్రమంలోనే స్థానికుల బరువుకి బావి పిట్టా గోడ ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో అక్కడ ఉన్న వారు 50 అడుగుల బావిలో పడి మట్టిలో కూరుకుపోయారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.

ఈ ఘటనలో 11 మంది మృతి చెందగా.. పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బృందం రెస్క్యూ ఆపరేషన్ చేసి మిగిలిన వారిని రక్షించారు. చివరిగా బాలుడు మృతదేహాన్ని వెలికి తీయడంతో సహాయక చర్యలు పూర్తి స్థాయిలో ముగిసినట్లు తెలుస్తున్నాయి.

రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ చౌహాన్ మృతుల కుటుంబాలకు 5 లక్షలు, గాయపడిన వారికీ 50,000 చొప్పున నష్టపరిహారం ప్రకటించగా.. ప్రధాని మోడీ మృతుల కుటుంబాలకు 2 లక్షల నష్టపరిహారం ప్రకటించారు. ఈ ఘటనపై ప్రధాని మోడీ, రాహుల్ గాంధీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

x