బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్, కిరణ్ రావుల వివాహ జీవితానికి నేటితో తెరపడింది. 15 సంవత్సరాల వైవాహిక జీవితానికి ముగింపు పలకనున్నట్లు అమీర్ ఖాన్, కిరణ్ రావు దంపతులు ప్రకటించారు. ఈ మేరకు వారిద్దరూ ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ఆ ప్రకటన లో వారు విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు.

ఇక పై వారి జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించాలని అనుకుంటున్నారు. ఇక పై భార్యాభర్తలుగా కొనసాగమని కుటుంబ సభ్యులుగా జీవిస్తామని వారు ప్రకటించారు. మా అబ్బాయి ‘ఆచార్య’ బాధ్యతలను ఇద్దరం చూసుకుంటామని వారు చెప్పుకొచ్చారు. ఈ విషయం బాలీవుడ్ తో పాటు ఇతర చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశమైంది.

మొదటి భార్య రీనా దత్తా నుంచి విడాకులు తీసుకున్న తర్వాత అమీర్ ఖాన్, కిరణ్ రావు ని ప్రేమ వివాహం చేసుకున్నారు. అమీర్ ఖాన్ నటించిన ‘లగాన్’ సినిమాకు కిరణ్ రావు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశారు. ఆ సినిమా షూటింగ్ లో వీరిద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. అది ప్రేమగా మారింది. అనంతరం వీరిద్దరు 2005 డిసెంబర్ 28న పెళ్లి చేసుకున్నారు.

x