పిల్లల మనస్తత్వాలు ఎలా మారుతున్నాయో చూస్తుంటే నిజంగా ఆందోళన కలుగుతుంది. కుక్కపిల్ల కొనివ్వలేదని ఒక పిల్లవాడు ఆత్మహత్య చేసుకున్నాడు. విశాఖలో జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం సృష్టించింది.

విశాఖ జిల్లాకు చెందిన సత్తిబాబు, ఉమా అనే దంపతులకు ఒక్కగానొక్క కుమారుడు ఉన్నాడు. అతని పేరు షణ్ముఖ్ వంశీ. అతను ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ చదువుతూ ఐఐటీ కి ప్రిపేర్ అవుతున్నాడు. తండ్రి సత్తిబాబు ట్రావెల్ ఏజెన్సీ నిర్వహించేవాడు. తండ్రి ఆరేళ్ల క్రితం ఆరోగ్య సమస్యలతో చనిపోయారు. అప్పట్నుంచి కుమారుడి ఆలనాపాలనా అన్ని తల్లే చూస్తుంది.

ఒక్కగానొక్క కొడుకు కావడంతో కాస్త గారాబంగా పెంచింది. ఈ మధ్య వంశి ఆన్లైన్లో 30 వేల విలువైన ఒక కుక్కపిల్లను చూసి కొని ఇవ్వాలని తల్లిని అడిగాడు. అయితే ప్రస్తుతం తన దగ్గర అంత డబ్బులు లేవని తర్వాత తప్పకుండా కొనిస్తానని తల్లి చెప్పింది. అడిగిన వెంటనే కుక్కపిల్లను కొనివ్వలేదని ఆ కుర్రోడు ఉరేసుకుని ప్రాణం తీసుకున్నాడు.

ఇంటికి తిరిగి వచ్చే సమయానికి కొడుకు ఫ్యాన్ కు వేలాడుతూ ఉంటే ఆ కన్నతల్లి హృదయం తట్టుకోలేకపోయింది. కుమారుడి మృతితో తల్లి గుండెలు బాదుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంటే చూసిన వారంతా చలించిపోయారు.

x