హీరో నిఖిల్ మరియు అనుపమ పరమేశ్వరన్ కలిసి నటిస్తున్న సినిమా 18 పేజీలు. ఈ సినిమా యొక్క ఫస్ట్ లుక్ పోస్టర్ కొద్దిసేపటి క్రితమే విడుదల అయ్యింది. విడుదలైన పోస్టర్ లో నిఖిల్ మరియు అనుపమ పరమేశ్వరన్ ఒక రొమాంటిక్ లుక్ తో కనిపించారు.
పాస్టర్ లో నిఖిల్ కళ్ళను కప్పి ఉన్న క్లాట్ (cloth) పై అనుపమ తన పాత్ర యొక్క వివరాలను క్లుప్తంగా రాస్తుండగా, నిఖిల్ కుర్చీలో శ్రద్ధగా కూర్చున్నాడు. ఆ పోస్టర్ అందరి దృష్టిని ఆకర్షించే విధంగా ఉంది.
ఈ సినిమాకు పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకి కథ మరియు స్క్రీన్ ప్లే ను సుకుమార్ అందించారు. గీతా ఆర్ట్స్ పిక్చర్స్ పై దీనిని నిర్మిస్తున్నారు.