దేశంలో కరోనా కేసుల వివరాలు:

భారత దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతుంది, రోజు రోజుకి కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. వరుసగా నాలుగోవ రోజు మూడున్నర లక్షల కు దగ్గరగా కేసులు నమోదయ్యాయి. ఒక రోజులో కరోనా వల్ల 2,624 మంది చనిపోయారు. గడచిన 24 గంటల్లో 3 లక్షల 46 వేల 726 కొత్త కేసులు నమోదయ్యాయి. దేశంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య ఒక కోటి 66 లక్షల 10 వేలు 481 ఉండగా, మరణాలు ఒక లక్షా 89 వేల 544 కి చేరింది. మరోవైపు గడిచిన 24 గంటల్లో 2 లక్షల 19 వేల 838 మంది కరోనా నుంచి కోలుకున్నారు. భారత్ లో కరోనా యాక్టివ్ కేసులు 25 లక్షల 52 వేల 940 గా ఉన్నాయి. దేశంలో ఇప్పటి వరకు 13.83 కోట్ల మందికి పైగా వాక్సినేషన్ ప్రక్రియ పూర్తయింది. ఒక్క రోజులో ఈ రేంజ్ లో కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి.

తెలంగాణలో కరోనా కేసుల వివరాలు:

తెలంగాణలో రోజురోజుకీ కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి దీనితో అందరు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రంలో కొత్తగా 7,432 కరోనా కేసులు నమోదు కాగా, ఒక రోజులో 32 మంది కరోనా భారినపడి మృతి చెందారు. హైదరాబాదులో 1464 కేసులు, మేడ్చల్ లో 606 కేసులు, రంగారెడ్డి జిలాల్లో 504 కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 3 లక్షల 87 వేలు దాటింది. ఇప్పటివరకు దాదాపు రెండు వేల మంది చనిపోయారు.

x