ప్రపంచంలోనే అరుదైన నల్ల వజ్రం వేలానికి రాబోతుంది. ఈ బ్లాక్ డైమండ్ కు ది ఎనిగ్మా (The Enigma) అని పేరు పెట్టారు. ఇటీవలే ఈ వజ్రాన్ని దుబాయ్ లో ప్రదర్శించారు. ఈ బ్లాక్ డైమండ్ 555.55 క్యారెట్ల బరువు ఉన్నట్లు దుబాయ్ లోని వజ్రాలు వేలం వేసే సోత్బై సంస్థ తెలిపింది. ఈ బ్లాక్ డైమండ్ ప్రారంభ ధర రూ. 50 కోట్లు ఉంటుందని తెలిపారు. 260 కోట్ల ఏళ్ల కిందట భూమిని ఓ గ్రహశకలం ఢీకొనడంతో ఈ వజ్రం తయారై ఉండొచ్చని నిపుణుల అంచనా వేస్తున్నారు.
‘The Enigma’ – a treasure from interstellar space and the largest faceted diamond to ever come to auction is unveiled today in Sotheby’s Dubai https://t.co/1nyUAsTe8j #SothebysDiamonds #blackdiamond #SothebysJewels pic.twitter.com/s713AVo14c
— Sotheby’s (@Sothebys) January 17, 2022
అందుకే ఇది మామూలు నల్ల వజ్రం కాదంటున్నారు. ఈ బ్లాక్ డైమండ్ దాదాపు 20 ఏళ్లకు ముందు బయటపడింది. అరుదుగా లభించే ఈ వజ్రాలు కేవలం బ్రెజిల్ మరియు మధ్య ఆఫ్రికా ప్రాంతాల్లోనే దొరుకుతాయి. ఈ బ్లాక్ డైమండ్ ప్రత్యేకత ఏమిటంటే, దీనికి 55 ముఖలు ఉన్నట్లు సంస్థ నిర్వాహకులు తెలిపారు. అంతేకాదు ఇది చూడటానికి అరచేతి నిర్మాణాన్ని పోలిన (ఖంసా గుర్తు) ఆకారంలో ఉంటుంది. మధ్య ప్రాచ్య దేశాల్లో అరచేయి నిర్మాణాన్ని పోలిన వజ్రాలను శుభసూచికంగా భావిస్తారు.
ఈ డైమండ్ వచ్చే నెల ఫిబ్రవరి 3 నుంచి 9 వరకు ఆన్ లైన్ వేలంలో అందుబాటులో ఉండనుంది. దీన్ని సొంతం చేసుకునే వాళ్ళు క్రిప్టో కరెన్సీ రూపంలో సొమ్మును చెల్లించాలని వేలం వేసే సంస్థ ప్రకటించింది. ప్రస్తుతం దుబాయ్ లో ఉన్న ఈ వజ్రాన్ని లాస్ ఏంజల్స్ లండన్ లో వేలం వేయనున్నారు. ఈ వేలం లో బ్లాక్ డైమండ్ ధర ఎంత పలుకుతుంది అన్నది ఆసక్తిగా ఉంది.