ఢిల్లీ అంతర్జాతీయ పోస్ట్ ఆఫీస్ లో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఆఫ్రికా నుంచి ఢిల్లీకి వచ్చిన ఓ పార్సిల్ లో దాదాపు 7.5 కోట్ల విలువైన హెరాయిన్ డ్రగ్స్ ను కస్టమ్స్ అధికారులు గుర్తించారు. ఢిల్లీలోని గురుగ్రాం అడ్రసుకు ఈ పార్సిల్ వచ్చిందని అధికారులు చెబుతున్నారు.

అయితే, ఈ పార్సిల్ అనుమానాస్పదంగా కనిపించడంతో కస్టమ్స్ అధికారులు దీనిని తనిఖీ చేశారు. అత్యాధునిక పరికరాలతో పార్సిల్ ను స్కానింగ్ చేయగా అందులో నిషేధించిన డ్రగ్స్ ఉన్నట్లు తెలుసుకున్నారు. దీంతో అధికారుల బృందం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆఫ్రికా అడ్రస్ లో ఎవరు ఉంటున్నారు, గురుగ్రాం అడ్రస్ లో ఎవరికి వచ్చిందనే సమాచారాన్ని కస్టమ్స్ అధికారులు కనుకుంటున్నారు. విమాన మార్గం ద్వారా వస్తే పట్టుకుంటున్నారు అనే ఉద్దేశంతో స్మగ్లర్స్ కొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు.

x