ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమలలో పేలుడు పదార్థాలు కలకలం సృష్టించాయి. దీంతో అందరు ఒక్కసారిగా షాకయ్యారు. వివరాల్లోకి వస్తే, శబరిమల ఆలయానికి వెళ్లే మార్గంలో పెన్ ఘాట్ వంతెన ఉండి. ఆ పెన్ ఘాట్ వంతెన కింద 6 జిలెటిన్ స్టిక్స్ (పేలుడు పదార్థాలు) లభ్యమయ్యాయి. ఆ పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం అక్కడ బాంబు స్క్వాడ్ సాయంతో తనిఖీలు చేపట్టారు.

ఇదే మార్గంలో స్వామివారికి బంగారు ఆభరణాలను తీసుకొస్తారు. పీజీ శశి కుమార్ వర్మ మరియు జనరల్ సెక్రెటరీ ప్రసాద్ ఈ ఘటనపై ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టాలని సూచించారు. ఇదిలా ఉంటే మకరజ్యోతి దర్శనం కోసం భక్తులు పలు ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున శబరిమల కు వచ్చారు. ఈ రోజు నుంచి ఆలయాన్ని మూసి వేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

x