హైదరాబాద్ రాజేంద్ర నగర్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఇంటి ముందు నిలబడి ఉన్నా బాలుడి పైకి ఒక కారు దూసుకు వచ్చింది. ఆ కారు అతివేగంతో ఆ బాలుడిని ఢీకొట్టింది. దీంతో ఆ పిల్లవాడు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. స్థానికుల రాకను గమనించి కారులో ఉన్న వారు అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేశారు.

ఒక్కసారిగా పెద్ద శబ్దం రావడంతో కాలనీవాసులు వెంటనే బయటకు వచ్చారు. పారిపోతున్న కారు డ్రైవర్ ను పట్టుకొని చితకబాదారు. డ్రైవర్ తో పాటు కారులో ఉన్న వారంతా మద్యం మత్తులో ఉన్నట్టు గుర్తించారు. ఆ బాలుడిని హాస్పటల్ కి తరలించారు. ప్రస్తుతం బాలుడు పరిస్థితి విషమంగా ఉంది. ఇదంతా అక్కడ ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది.

x