ల్యాండ్ మైన్స్ గుర్తించేందుకు బాంబు స్క్వాడ్స్ మరియు సెన్సార్లు అందుబాటులో ఉన్నాయి. కానీ ల్యాండ్ మైన్స్ ని పక్కాగా గుర్తించి అందరిని అలర్ట్ చేసే జంతువు గురించి మీకు తెలుసా..? కంబోడియాలో బాంబు స్క్వాడ్స్ కంటే ముందు మగవా అనే ఎలుక ల్యాండ్ మైన్స్ ను పక్కా గా గుర్తించి డిఫ్యూస్ చేయడంలో సహకరిస్తుంది.

ఆఫ్రికాలో ఈ ఎలుకకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ల్యాండ్ మైన్స్ గుర్తించడంలో దీనికి ఒక ప్రత్యేకత ఉంది. ఐదేళ్ల పాటు సేవలందించిన ఈ ఎలుక ఎట్టకేలకు రిటైర్ అయ్యింది. బెల్జియం కు చెందిన ఓ సంస్థ ఈ ఎలుకకు ట్రైనింగ్ ఇచ్చింది. తర్వాత కాంబోడియా ఆర్మీ కు ఐదేళ్లపాటు సేవలందించింది. ల్యాండ్ మైన్స్ గుర్తించడం, వెంటనే అందరిని అలర్ట్ చేయడం దీని పని.

అంతేకాదు దీని సర్వీస్ లో అనేక అవార్డులు అందుకుంది. జంతువుల సాహసాలకు ఇచ్చే అత్యున్నత పురస్కారం కూడా ఈ ఎలుకకు దక్కింది. సాధారణంగా దీనిని కుక్క లకు మాత్రమే ఇస్తారు. మగవా ఇప్పటివరకు దాదాపు 71 ల్యాండ్ మైన్స్ గుర్తించింది. ఇందులో 38 బాంబులు పేలక ముందే డిఫ్యూస్ చేసేందుకు సహకరించింది. ప్రస్తుతం ఈ ఎలుక పూర్తి ఆరోగ్యంగా ఉన్నప్పటికీ రిటైర్మెంట్ సమయం వచ్చిందని అధికారులు చెబుతున్నారు.

x