ఢిల్లీ అసెంబ్లీలో భారీ సొరంగ మార్గం బయటపడింది. ఈ సొరంగ మార్గం అసెంబ్లీ నుంచి ఎర్రకోట వరకు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఢిల్లీ శాసన సభ నుంచి ఎర్రకోట వరకు 13 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అయితే అంత దూరం ఈ సొరంగాన్ని తవ్వినట్లు తేలింది. ఈ సొరంగ మార్గాన్ని బ్రిటిష్ కాలంలో నిర్మించినట్లు అంచనా వేస్తున్నారు. సొరంగం తవ్వడానికి వినియోగించిన పరికరాలు ప్రాచీనకాలానికి సంబంధించినవి కాకపోవచ్చని ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ చెప్పారు.

బ్రిటీషర్లు స్వాతంత్ర సమరయోధులను తరలించడానికి ఈ సొరంగ మార్గాన్ని ఉపయోగించేవారని ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ రామ్ నివాస్ గోయల్ తెలిపారు. 1993లో ఎమ్మెల్యే గా ఎన్నికైన‌ప్పుడు ఈ టన్నెల్ గురించి చాలా వినేవాడిన‌ని, దాని గురించి తెలుసుకునే ప్రయ‌త్నం చేశాన‌ని, కాకపోతే ఎటువంటి విషయాలు తెలియలేదని రామ్ నివాస్ అన్నారు. కానీ, ఈ టన్నెల్ ను ఇప్పుడు విస్తరించే ప్రతిపాదనలు ఏమీ లేవన్నారు. ఎందుకుంటే దీనివల్ల మెట్రో రైల్ ప్రాజెక్టులు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ కు ఇబ్బంది కలిగే అవకాశం ఉందని చెప్పారు.

x