హీరో సిద్ధార్థ్ బాయ్స్, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బొమ్మరిల్లు సినిమాలతో తెలుగు సినిమా ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకున్నాడు. ఇప్పటికి కూడా సిద్ధార్థ్ ఒక తెలుగు అబ్బాయి లానే ఉంటాడు. తమిళ హీరో అని ఎవరు అనుకోరు. అంతలా మన తెలుగు ప్రేక్షకుల హృదయంలో స్థిరపడి పోయాడు. అయితే గత కొన్ని సంవత్సరాలుగా సిద్ధార్థ కి తెలుగులో హిట్స్ రాకపోవడంతో తను తమిళ ఇండస్ట్రీకి వెళ్లి సినిమాలు చేసుకుంటూ ఉన్నాడు.

కాగా, ఇటీవలే ఆర్ ఎక్స్ 100 డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వంలో శర్వానంద్ తో కలిసి ‘మహాసముద్రం’ అనే మల్టీ స్టారర్ మూవీ లో నటిస్తూ మళ్లీ తెలుగు లోకి రీ ఎంట్రీ ఇస్తున్నాడు. అయితే, ఇటీవల ఒక యూట్యూబ్ ఛానెల్ సిద్ధార్థ్ చనిపోయాడంటూ ఫేక్ థంబ్‌నెయిల్‌ తో ఒక వీడియో విడుదల చేశారు.

ఆ వీడియోలో సౌందర్య మరియు ఆర్తి అగర్వాల్ ఫొటోస్ మధ్యలో సిద్ధార్థ్ ఫోటో పెట్టి యంగ్ ఏజ్‌లో చనిపోయాడంటూ ప్రచారం చేశారు. ఆ వీడియో చుసిన ఓ నెటిజన్ దాన్ని స్క్రీన్ షాట్ తీసి ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. దీంతో ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ పోస్ట్ చుసిన సిద్ధార్థ్ మండిపడుతూ సంచలనమైన కామెంట్స్ చేశాడు.

ఆ న్యూస్ చాలా సంవత్సరాల క్రితమే జరిగిందని, ఆ సమయంలో సదరు యూట్యూబ్ ఛానల్ కు తాను ఫిర్యాదు చేశానని కాకపోతే వారు క్షమించండి, ఈ వీడియో తో ఎలాంటి సమస్య లేదని చెప్పారు. సిద్ధార్థ ఫిర్యాదు చేసిన వారు పట్టించుకోకపోవడంతో ఈ న్యూస్ వైరల్ గా మారింది. లైక్స్ కోసం, వ్యూస్ కోసం మరి ఇంతలా దిగజారాలా ఇలాంటి పిచ్చిపిచ్చి పోస్టులు చేయడం ఆపండి అంటూ సిద్ధార్థ్ మండిపడ్డాడు.

ఇటీవల ఒక ప్రెస్ మీట్ లో ‘మహాసముద్రం’ మూవీ గురించి మాట్లాడుతూ ఈ సినిమా అద్భుతంగా ఉంటుందని, ఈ సినిమాతో మళ్లీ తెలుగు ప్రజల్లో ఎంతో ఆదరణ లభిస్తుందని ఇకపై బ్యాక్ టు బ్యాక్ తెలుగు సినిమాలు కూడా చేస్తానని సిద్ధార్థ్ చెప్పుకొచ్చారు.

x