ఒకే కాన్పులో కవలలు పుట్టడం మనం సహజంగా చూస్తాము, ముగ్గురు లేదా నలుగురు ఒకేసారి పుట్టడం అరుదుగా చూస్తాము. కానీ ఒకే కాన్పులో ఏకంగా తొమ్మిది మంది శిశువులు జన్మించడం మనం ఎక్కడ చూసి ఉందాము. కానీ ఆ ఘటన జరిగింది, పశ్చిమ ఆఫ్రికాలోని మాలికి చెందిన 25 సంవత్సరాలు కలిగిన హాలిమా సిస్సే అనే మహిళా ఏకంగా ఒకే కాన్పులో తొమ్మిది మంది శిశువులకు జన్మనిచ్చింది. అందులో ఐదుగురు ఆడపిల్లలు మరియు నలుగురు మగపిల్లలు ఉన్నారు.
ఆమెకు డాక్టర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని కాన్పు చేశారు. మార్చి నెలలో బిడ్డ సురక్షితంగా ఉందా లేదా అని ఆమెకు వైద్యులు స్కానింగ్ చేశారు. వాస్తవానికి ఆమె గర్భంలో ఏడుగురు శిశువులు ఉన్నట్లు భావించారు చికిత్స అందించిన వైద్య బృందం. అయితే ఏకంగా తొమ్మిది మంది పిల్లలకు జన్మనివ్వడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు.
30వ వారం లోనే శిశువులకు జన్మనిచ్చింది. డెలివరీ సమయంలో రక్తస్రావం ఎక్కువైనప్పటికీ ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉంది. అలాగే ఆ నవజాతశిశువులను ఇంకుబేటర్ లో పెట్టారు. తొమ్మిది మంది శిశువులు మరియు తల్లి ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు చెప్పారు.అందరు క్షేమంగా ఉండడంతో వైద్యులు ఆనందం వ్యక్తం చేశారు.