భార్యాభర్తల మధ్య గొడవలు జరగడం సహజమే. ఆ గొడవలో ఏ ఒక్కరైనా సహనం కోల్పోతే పరిస్థితి చాలా దారుణంగా మారుతుంది. అప్పుడు వారు ఏం చేస్తారో వారికే తెలియదు. ఇలాంటి ఘటనే బ్రెజిల్ లో కూడా జరిగింది. బ్రెజిల్లో నివసిస్తున్న సావో అనే మహిళ తన భర్త తో గొడవ పడింది. ఈ గొడవలో ఆ మహిళ తన భర్తను హత్య చేసింది. అంతేకాదు తన భర్త మర్మాంగాన్ని కోసి కూర వండింది.
ఈ నెల 7వ తేదీన సావో తన భర్త ఆండ్రీ తో గొడవ పడింది. ఈ గొడవలో ఆండ్రీ పెద్దగా కేకలు పెట్టాడు. ఆ కేకలు చుట్టుపక్కల వారికి కూడా వినిపించాయి. అయితే వీరిద్దరూ తరుచూ గొడవ పడటంతో చుట్టుపక్కల వారు దీన్ని పట్టించుకోలేదు. అయితే ఉదయం ఆమె కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు లోపల దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయారు. అక్కడ ఆండ్రీ రక్తపుమడుగులో నగ్నంగా పడిపోయి ఉన్నాడు. సావో తన భర్త శరీరాన్ని ముక్కలుగా చేసింది మరియు తన మర్మాంగాన్ని కోసి వంట గదిలో పెనం మీద వేయించిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటన సుమారు ఉదయం 4 గంటల సమయంలో జరిగి ఉండవచ్చని వారు తెలిపారు.
ఈ ఘటనలో సావో తరుపు న్యాయవాది మాట్లాడుతూ, ఆండ్రీ తనని చంపడానికి ప్రయత్నించాడు, దీంతో ఆత్మరక్షణ కోసం ఆమె ఆండ్రీని చంపాల్సి వచ్చిందని చెప్పారు. అయితే హత్య చేసిన తర్వాత పోలీసులకు ఎందుకు చెప్పలేదు మరియు తన శరీరాన్ని ఎందుకు ముక్కలు చేసింది? అతని మర్మాంగాన్ని కోసి ఎందుకు కూర వండింది? అనే ప్రశ్నలకు మాత్రం వారు సరైన సమాధానం చెప్పలేదు. అయితే హత్యకు గల కారణాలు ఇంకా తెలియలేదు. పోలీసులు కేసును ఇంకా దర్యాప్తు చేస్తున్నారు.