ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 30 మంది అమ్మాయిలను పెళ్లి పేరుతో మోసం చేసిన కిలాడీ భాగవతం బయటపడింది. ఓ బట్ట తల వ్యక్తి విగ్గు పెట్టుకొని అందగాడిగా బిల్డప్ ఇచ్చి యువతులను మాయమాటలతో మోసం చేసిన ఘటన చిత్తూరు జిల్లాలో కలకలం రేపుతోంది. పెళ్లి, ఉద్యోగాల పేరుతో అమాయకులైన యువతులను మోసం చేస్తూ కోట్లాది రూపాయలను దోచుకున్నాడు.

ఈ మధ్య విడుదలైన ‘నూటొక్క జిల్లాల అందగాడు’ సినిమా చూశారుగా, అందులో హీరోకి బట్టతల ఉంటుంది. కానీ, విగ్గు పెట్టుకుని బిల్డర్ ఇస్తూ ఉంటాడు. అయితే, ఇదే స్టైల్ లో శ్రీనివాస్ అనే కిలాడీ ఏకంగా 30 మంది అమ్మాయిలను పెళ్లి పేరుతో మోసం చేశాడు. ఏపీ, తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక సహా పలు రాష్ట్రాల్లోని యువతులను మోసం చేశాడు.

చిత్తూరుకు చెందిన ఓ బాధిత మహిళ ఫిర్యాదుతో పోలీసులు ఆ కేటుగాడిని అరెస్ట్ చేశారు. అతను ప్రకాశం జిల్లా అద్దంకి చెందిన వాడిగా గుర్తించారు. గంజాయి వ్యాపారం అతని సైడ్ బిజినెస్. అలా వచ్చిన డబ్బంతా స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడుతూ ఉంటాడు. అలా వచ్చినా కోట్లాది రూపాయల డబ్బును గోవాలో క్యాసినో ఆడి పోగొట్టుకున్నాడు.

x