ABN, MD వేమూరి రాధా కృష్ణ గారి కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. వేమూరి రాధాకృష్ణ గారి సతీమణి కనకదుర్గ కన్నుమూశారు.ఆమె కొన్ని వారాలుగా అనారోగ్యంతో హాస్పిటల్ లో చికిత్స పొందుతు తుది శ్వాస విడిచారు. వేమూరి కనకదుర్గ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల ఫైనాన్స్ డైరెక్టర్ గా సంస్థల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. ఆమె వయసు 63 సవంత్సరాలు.
ఆంధ్ర జ్యోతి గ్రూపుకు చెందిన అమోడా పబ్లికేషన్స్ డైరెక్టర్లలో కనక దుర్గా ఒకరు. ఆర్‌కె, కుటుంబ సభ్యులకు పలువురు రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, మీడియా ప్రముఖులు సంతాపం తెలిపారు. ఉదయం 11:30 నుండి 12:30 మధ్యలో జూబ్లీహిల్స్ మహాప్రస్థానం లో కనకదుర్గ భాతిక దేహానికి అంత్యక్రియలు జరగనున్నాయి.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్, సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఇతర ప్రముఖులు కూడా వేమూరి కనకదుర్గ మరణం పట్ల సంతాపం వ్యక్తం చేశారు.