అబుదాబి టీ10 లీగులో కరేబియన్ విధ్వంశ ఆటగాడైన నికోలస్ పూరన్ సిక్సర్ల వర్షం కురిపించాడు. ఎంతలా అంటే అతని బాటింగ్ దాటికి బౌండరీలు కూడా చిన్నబోయాయి. ఇక గత ఆదివారం బంగ్లాదేశ్ పైన నార్తెన్ వారియర్స్ మ్యాచ్లో వారియర్స్ టీం తరపున ఆడిన పూరన్ ఆకాశమే హద్దుగా చెలరేగి అతని బాటింగ్ పవర్ చూపించాడు.

ఎంతలా అంటే ఒకసారి ఐపీల్ లో సురేష్ రైనా 25 బంతుల్లో 87 పరుగులు ఇన్నింగ్స్ ని తలపించేలా మొత్తం 26 బంతుల్లో 89 పరుగులు సాదించి, ఎంత డేంజరస్ ఆటగాడో మరోసారి నిరూపించాడు. ఇక నికోలస్ పూరం ఆడిన ఈ ఇన్నింగ్స్ లో 5 కాదు 10 కాదు, ఏకంగా 12 సిక్సులు ఉన్నాయి.

ఒక సిక్సర్ల మీద 72 పరుగులు సాధించాడు. అలాగే ఈ ఇన్నింగ్స్ లో 3 ఫోరులు కూడా ఉన్నాయి. ఇక పూరన్ విధ్వంశకర బాటింగ్ ధాటికి, తన టీం 10 ఓవర్లలో ఏకంగా 162 పరుగులు సాదించింది. ఇది ఈ టోర్నమెంట్ హిస్టరీలోనే రెండో అతి పెద్ద టోటల్ స్కోర్.

ఇక పూరన్ ఈ మ్యాచ్లో 9వ చివరి బంతి లో అవుట్ అయిపోయాడు గాని, లేకుంటే గైల్ 30 బంతుల్లో సెంచరీ రికార్డుని కూడా చెరిపేసి ఉండేవాడు. పూరన్ ఈ మ్యాచ్లో జార్జ్ కాటన్ వేసిన 8 వ ఓవర్లో ఏకంగా వరసగా 4 సిక్సర్లు, 2 ఫోరులు కొట్టి, ఆ ఒక్క ఓవర్లోనే ఏకంగా 32 పరుగులు పిండుకున్నాడు.

ఇక ఐపీల్ కింగ్స్ తరపున ఆడిన పూరన్, లాస్ట్ సీజన్లో కూడా మెరుపులు మెరిపించాడు. అయితే ఈ ఇప్పుడు ఇన్నింగ్స్ చూసాక, ఈసారి ఐపీల్ లో ఎలాంటి మెరుపులు మెరిపిస్తాడో చూడాలి.

x