రెండుసార్లు లాక్ డౌన్ ను సరిగ్గా సద్వినియోగం చేసుకోవడంలో మెగాస్టార్ చిరంజీవి ప్లానింగ్ అందరికీ స్ఫూర్తిని నింపింది. ఓవైపు కరోనా చారిటీ ప్రారంభించి సేవలు అందిస్తూనే మరోవైపు తన తదుపరి సినిమాలకు సంబంధించి కథలను మరియు దర్శకులను ఫైనల్ చేస్తూ బిజీగా గడిపారు. ఇప్పటికే నలుగురు దర్శకులు మెగాస్టార్ క్యూలో ఉన్నారు.

చిరు, కొరటాల బృందం ఈ నెలాఖరు నుంచి కీలకమైన యాక్షన్ ఎపిసోడ్స్ చిత్రీకరించడం కోసం సిద్దం అవుతున్నారు. ఇప్పటికే చాలా మంది స్టార్ హీరోలు లొకేషన్స్ లో కుస్తీలు పడుతుంటే చిరంజీవి మాత్రం కాస్త వేచి చూసే ధోరణిలో ఉన్నారు. చిరంజీవి ఈ నెలాఖరు నాటికి సెట్స్ పైకి వెళ్తారని తెలుస్తుంది. అయితే ఈ నెల రోజుల సమయాన్ని సద్వినియోగం చేసుకునేందుకు కొరటాల శివ ప్లాన్ చేశారు.

రామ్ చరణ్ పై ఈ నెల 6 నుంచి ఒక భారీ ఫైట్ ని చిత్రీకరించనున్నారు. చరణ్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో ఇది ఎంట్రీ సీన్ గా ఉంటుందని తెలుస్తోంది. ఇంతకు ముందే చరణ్, పూజా హెగ్డే జంటపై కొన్ని కీలక సన్నివేశాలను, పాటలను చిత్రీకరించారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు. నక్సలైట్ బ్యాక్‌డ్రాప్ ఈ చిత్రం తెరకెక్కుతున్నట్లు తెలుస్తుంది.

 

x