‘ఆచార్య’ నిర్మాతలు తెలుగు నూతన సంవత్సరం సందర్బంగా తెలుగు ప్రేక్షకులకు ఆశ్చర్యం కలిగించే పోస్టర్‌తో శుభాకాంక్షలు తెలిపారు. ఈ పోస్టర్‌లో మెగాపవర్‌స్టార్ రామ్ చరణ్ మరియు పూజా హెగ్డే కనిపించారు. ఈ పోస్టర్లో వారి ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ చాలా చక్కగా కనిపిస్తుంది.

 

View this post on Instagram

 

A post shared by Ram Charan (@alwaysramcharan)

రొమాంటిక్ ఫోస్ లో చరణ్, పూజ ఒకరినొకరు చూసుకుంటున్నారు. సిద్దు మరియు నీలాంబరి యొక్క ప్రేమను పరిచయం చేస్తూ, మీ అందరికీ చాలా హ్యాపీ ఉగాది శుభాకాంక్షలు ”అని రామ్ చరణ్ ఈ పోస్ట్ చేశాడు. పూజా యొక్క పాత్రను ఆవిష్కరించారు. పూజా ప్రత్యేక అతిధి పాత్రలో కనిపించనుంది. ఆమె కొన్ని పాటలలో కూడా కనిపించే అవకాశం ఉంది.

మెగాస్టార్ చిరంజీవి, కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘ఆచార్య’ సినిమాకు కొరటాల శివ దర్శకుడు. ఈ చిత్రం షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ సినిమా ను మ్యాటినీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌లో నిరంజన్ రెడ్డి నిర్మించారు, ఇది మణి శర్మ మ్యూజికల్.

x