పెట్రోల్ మరియు డీజిల్ ధరలు విపరీతంగా పెరిగాయి. దీంతో చాలా మంది సామాన్యులు ఆందోళన చెందుతున్నారు. జూలై 2020 నుండి పెట్రోల్ మరియు డీజిల్ ధరలు సుమారుగా 25 రూపాయల వరకు పెరిగాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో పెట్రోల్ ధరలు 100 రూపాయలకు చేరుకున్నాయి. హైదరాబాద్లో కూడా ప్రస్తుతం పెట్రోల్ ధర 99.62 రూపాయలుగా ఉంది. ఈ శనివారం లోపు ఈ పెట్రోల్ ధర 100 రూపాయలకు చేరుకోవచ్చు.
పెరుగుతున్న ధరలకు వ్యతిరేకంగా తెలంగాణ కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. వారు తమ నిరసనను ఒక ప్రత్యేకమైన రీతిలో తెలియజేశారు. ఒక బైక్ ను హుస్సేన్ సాగర్ లో వేసి తమ నిరసనను తెలియజేశారు. బైక్ ను హుస్సేన్ సాగర్ లో వేస్తున్నప్పుడు వీడియో తీశారు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతుంది.