ప్రముఖ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణించిన సరిగ్గా ఏడాది తరువాత, భారతీయ సినిమా ఇండస్ట్రీ మరో గొప్ప నటుడిని కోల్పోయింది. ప్రముఖ నటుడు, జాతీయ అవార్డు గ్రహీత సాంచరి విజయ్ కన్నుమూశారు.

విజయ్ శనివారం రాత్రి తన స్నేహితుడి బైక్ పై ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు యాక్సిడెంట్ అయింది. ఈ ప్రమాదంలో ఆయన కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతన్ని బెంగళూరులోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చారు. అతన్ని ఐసీయూలో ఉంచారు. మెదడు యొక్క కుడివైపున తీవ్రమైన రక్తస్రావం ఉండని వైద్యులు తెలిపారు. దీంతో ఆయన కొద్ది నిమిషాల క్రితం కన్నుమూశారు. విజయ్ కుటుంబం అతని అవయవాలను దానం చేయాలని నిర్ణయించుకుంది. సంచారి విజయ్‌ మరణ వార్త విని పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

30 ఏళ్ల ఈ నటుడు 2011వ సంవత్సరంలో ‘రంగప్ప హోగ్‌బిట్న’ చిత్రంతో సినీరంగ ప్రవేశం చేశాడు. ఆ తర్వాత ‘హరివూ’, ‘ఒగ్గరానే’ వంటి ఇతర సినిమాల్లో నటించారు. నాను అవనాల్ల… అవలు చిత్రానికి 62 వ జాతీయ చలన చిత్ర అవార్డులలో ఉత్తమ నటుడి అవార్డును గెలుచుకున్నారు. అతని రెండు సినిమాలు ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్నాయి.

x