నటి మాలాశ్రీ భర్త మరియు కన్నడ చిత్ర నిర్మాత రాము ఈ రోజు కోవిడ్ తో భాదపడుతూ బెంగళూరులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో కన్నుమూశారు. 52 సవంత్సరాలు కలిగిన రామును క్రొరపతి రాము అని పిలుస్తారు. కన్నడ చిత్రాన్ని మొదట కోట్లకు పైగా బడ్జెట్‌తో నిర్మించిన తొలి కన్నడ నిర్మాత ఆయన, అందుకే ఆయనను ప్రేమతో క్రొరపతి రాము లేదా కోటి రాము అని పిలిచేవారు.

మాలాశ్రీ తెలుగులో అందరికి తెలిసిన నటి, అక్కా చెల్లెలు, పోలీస్ అల్లుడు, తోడి కొడల్లు, ఘరానా అల్లుడు మరియు మరెన్నో చిత్రాలలో ఆమె నటించారు. అలాగే, రాము రెండు దశాబ్దాల వ్యవధిలో కన్నడలో 37 చిత్రాలను నిర్మించారు. దురదృష్టవశాత్తు, కోవిడ్ కారణంగా శ్వాసకోశ సమస్యలతో బాధపడుతూ బెంగళూరులోని ఎం ఎస్ రామయ్య ఆసుపత్రిలో ఆయన ఈ రోజు చివరి శ్వాస విడిచారు.

రాము, మాలాశ్రీకి ఇద్దరు పిల్లలు. శాండల్ వుడ్ మరియు టాలీవుడ్ పరిశ్రమల నుండి చాలా మంది ప్రముఖులు సంతాపం ప్రకటించారు. నటుడు పునీత్ రాజ్ కుమార్ ట్వీట్ చేస్తూ “కెఎఫ్ఐ యొక్క అత్యంత అభిరుచి గల సినిమా నిర్మాతలలో రాము గారు ఒకరు, అయన ఇక లేరు అంటూ సంతాపన తెలియచేశారు” పునీత్ రాజ్ గారు. “నా తొలి నిర్మాత మరియు నాకు అద్భుతమైన శ్రేయోభిలాషి మీరు, KFI ఈ రోజు ఒక అద్భుతమైన నిర్మాతను కొలిపోయిందంటూ” కన్నడ యాక్టర్ శ్రీమురళిగారు ట్వీట్ చేశారు.

 

x