ప్రస్తుతం ప్రభాస్ ఆదిపురుష్ సినిమా కోసం ఓం రౌత్ తో జతకట్టారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈ ఆదిపురుష్ సినిమా రామాయ‌ణ ఇతిహాస గాథ ఆధారంగా తెరకెక్కనుంది. ఇంతలో ఈ సినిమా బాహుబలి 2 చేసిన రికార్డును బద్దలు కొట్టిందనే వార్తలు వస్తున్నాయి.

తాజా సమాచారం ప్రకారం, ఆదిపురుష్ సినిమా కోసం మూవ్ మేకర్స్ దాదాపు 8,000 విఎఫ్ఎక్స్ (VFX) షాట్లను ఉపయోగించనున్నట్లు సమాచారం. భారతీయ సినిమా లో ఇన్ని VFX షాట్ల ఏ సినిమాలో కూడా ఉపోయోగించలేదు. సూపర్ హిట్ గా నిలిచినా బాహుబలి2 సినిమాలో కూడా 2500 VFX షాట్లను మాత్రమే ఉపయోగించారు. అంటే ఆదిపురుష్, బాహుబలి 2 యొక్క VFX షార్ట్స్ కంటే మూడు రెట్లు ఎక్కువ. ఈ ఆదిపురుష్ సినిమా 3D ఫార్మెట్లో రానుంది.

ఈ సినిమాలో ప్రభాస్ రాముని పాత్ర లో నటించనున్నారు. సీతగా కృతిసనన్, రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ మరియు లక్ష్మణుడు పాత్రలో సన్నీ సింగ్ నటించనున్నారు. రామోజీ ఫిలిం సిటీ లో ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది.

ప్రభాస్ ప్రస్తుతం తన తదుపరి చిత్రం “రాధే శ్యామ్” విడుదల కోసం ఎదురు చూస్తున్నారు. అంతేకాదు, ప్రశాంత్ నీల్ దర్శకత్వం లో సాలార్ మూవీ చేస్తున్నారు మరియు నాగ్ అశ్విన్ దర్శకత్వం లో కూడా మూవీ చేయనున్నారు.

x