అగ్రిగోల్డ్ ఆ పేరు వింటేనే బాధితులకు, ఏజెంట్లకు గుండెలు మండిపోతున్నాయి కోట్ల రూపాయలు డిపాజిట్ రూపంలో వసూలు చేసి, ఆ తర్వాత అగ్రి గోల్డ్ కంపెనీ మూసివేశారు. దీంతో చాలా మంది జనం రోడ్డున పడ్డారు. పేదల కష్టానికి వడ్డీ ఆశ చూపించి వేల కోట్ల రూపాయలు అగ్రిగోల్డ్ కొల్లగొట్టింది. వచ్చిన డిపాజిట్లను వ్యాపారాల్లో పెట్టుబడులు గా పెట్టి దివాలా తీయడంతో 8 రాష్ట్రాల్లో లక్షలాది మంది ప్రజలు రోడ్డు మీద పడ్డారు.

వందలాది మంది ప్రజల ప్రాణాలు కోల్పోవడానికి కారణం అయింది. వ్యాపారాన్ని ప్రారంభించిన అగ్రిగోల్డ్ పెద్ద ఎత్తున వడ్డీ ఆశ చూపించి కోట్ల రూపాయలు వసూలు చేసింది, ఏజెంట్లకు భారీ మొత్తంలో కమీషన్లు ఆశ చూపించి జనం నుంచి వేల కోట్ల రూపాయల డిపాజిట్లు కొల్లగొట్టింది.

2014 వరకు ఈ వ్యాపారం బాగానే నడిచింది, డిపాజిట్లు రూపంలో వచ్చిన డబ్బులు మొత్తం అనేక వ్యాపారాలలో అగ్రిగోల్డ్ యాజమాన్యం పెట్టుబడులుగా పెట్టి దివాలా తీసింది. రియల్ ఎస్టేట్, వినోదం, మీడియా రంగాల్లో పెట్టుబడులు పెట్టడం తో సంస్థ నష్టాల ఊబిలో కూరుకు పోయింది.

2014 గు డిసెంబర్ వరకు ఆటుపోట్లు ఉన్నప్పటికీ చెల్లింపులను యాజమాన్యం ఏదో రకంగా చేసింది. అయితే 2015 జనవరి నుంచి సీన్ పూర్తిగా రివర్స్ అయ్యింది. యాజమాన్యం ఇచ్చిన చెక్కులు బౌన్స్ అవటంతో ఏజెంట్లు, బాధితులు రోడ్డు మీదకు వచ్చారు. అగ్రిగోల్డ్ వల్ల నష్టపోయిన ప్రజలకు ఇంకా న్యాయం జరగలేదు. ప్రభుత్వం కూడా న్యాయం చేస్తామని చెప్పి హామీ ఇచ్చింది. ఇంకా ఏ ప్రయోజనం లేకపోయింది.

ఇప్పుడు అగ్రిగోల్డ్ డైరెక్టర్ అవ్వా ఉదయ్ భాస్కర్ గుండెపోటుతో చనిపోయారు. హైదరాబాద్ లో ఉంటున్న అవ్వా ఉదయ్ భాస్కర్ అకస్మాత్తుగా మృతి చెందారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు మొత్తం శోకసంద్రంలో మునిగిపోయారు.

x