అల్లు అరవింద్ తీసుకువచ్చిన తెలుగు ‘ఆహా’ ఓటిటి ప్లాట్ ఫామ్ రెండు సంవత్సరాల కంటే తక్కువ సమయంలోనే అత్యంత పాపులారిటీని సంపాదించుకుంది. ఆహా ఓటిటి ప్లాట్ ఫామ్ ను మొదట తెలుగు వారి కోసమే ప్రత్యేకంగా తీసుకువచ్చారు. ఈ ఓటిటి ప్లాట్ ఫామ్ లో వస్తున్న తెలుగు సినిమాలు, టాక్ షోలు, వెబ్ సిరీస్ మరియు మలయాళ డబ్బింగ్ చిత్రాలు ప్రేక్షుకుల్ని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.
చాలా కాలం నుంచి ‘ఆహా’ ను ఇతర భాషల్లో కూడా విస్తరింప చేయాలని నిర్వాహకులు భావించారు. అందులో భాగంగా ‘ఆహా’ తమిళ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టనుంది. నిర్వాహకులు ‘ఆహా’ యొక్క తమిళ వర్షన్ ను త్వరలోనే అందుబాటులోకి తీసుకురాబోతున్నారు.
తాజా నివేదికల ప్రకారం, ‘ఆహా’ తమిళ వర్షన్ జనవరి 28 నుండి అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. అంతేకాదు, తాజాగా సముద్రఖని నటించిన ‘రైటర్’ సినిమాను ఈ ప్లాట్ ఫామ్ లో విడుదల చేయనున్నారు. శరత్ కుమార్ నటించిన ‘ఇరై’ వెబ్ సిరీస్ కూడా స్ట్రీమింగ్ కానుంది. వీటితో పాటు ఆహా లో అనేక తమిళ సినిమాలు, వెబ్ సిరీస్లు మరియు టాక్ షోలు కూడా ఉండబోతున్నాయి. తెలుగు ఆహా కు అల్లు అర్జున్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నట్లే తమిళ ఆహా వర్షన్ కు ఒక బ్రాండ్ అంబాసిడర్ ను పెట్టనున్నారు.