తెలుగు స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ అయినా ఆహా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ సారి ఆహాప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఒక విస్తృత కంటెంట్‌తో రానుంది. ప్రస్తుతం ఆహా కొత్త వెబ్ సిరీస్ ను సిద్ధం చేస్తుంది.
‘I.N.G.’ పేరుతో ఉన్న ఈ వెబ్-సిరీస్ లో కమిడియన్ ప్రియదర్శి మరియు నందిని రాయ్ ప్రధాన పాత్రల్లో నటిసున్నారు. ఈ వెబ్ సిరీస్ క్రైమ్ త్రిల్లర్ గా తెరకెక్కనున్నట్లు సమాచారం. తెలుగు స్ట్రీమింగ్ ప్రపంచంలో ఇది మరో గేమ్-ఛేంజర్ అవుతుందని ఆహా లక్ష్యం.
విద్యా సాగర్ ఈ వెబ్-సిరీస్కు దర్శకత్వం వహిస్తుండగా, సూపర్ స్టార్ రజనీకాంత్ యొక్క ‘బాషా’ ఫేమ్ దర్శకుడు సురేష్ కృష్ణ దీనిని నిర్మిస్తున్నారు. ఫస్ట్ లుక్ మరియు ఇతర వివరాలు రేపు బయటకు వస్తాయి.