యంగ్ హీరో అఖిల్ అక్కినేని ప్రస్తుతం “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్” లో నటిస్తున్నారు. ఈ సినిమా జూన్ 19 న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీని తర్వాత అఖిల్ ఒక యాక్షన్ ఎంటర్టైనర్ చేయనున్నారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ నిర్మించబోయే చిత్రంలో‌ అఖిల్ హీరోగా దర్శకుడు సురేందర్ రెడ్డి ఒక సినిమా తీస్తున్న సంగతి తెలిసేందే.

ఈ సినిమా యొక్క ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేసే డేట్ అనౌన్స్ చేశారు. ఈ పోస్టర్లో రెండు గన్స్ మధ్య ఒక పెన్ ఉంచినట్లు మనకు కనిపిస్తుంది. పోస్టర్ ఏమి చెబుతుంది? టైటిల్ లేదా ఫస్ట్ లుక్ చుస్తే దీని గురించిఏమైనా తెలుస్తుంది. ఈనెల 8వ తేదీన ఉదయం 9:09 గంటలకు ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేయనున్నారు. ఇది అఖిల్ కెరియర్ లో ఐదవ చిత్రంగా తెరెకెక్కనుంది.

x