బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ తల్లి అరుణా భాటియా ముంబైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి లో చికిత్స పొందుతూ ఈరోజు తెల్లవారుజామున కన్నుమూశారు. ఆమె వయసు 80 ఏళ్లు. తన తల్లి మరణించినట్లు అక్షయ్ కుమార్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.

అక్షయ్ తల్లి గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో భాదపడుతున్నారు. దీంతో వారి కుటుంబ సభ్యులు ఆమెను ముంబైలోని హీరానందని ఆసుపత్రి లో జాయిన్ చేసి చికిత్స చేయిస్తున్నారు. తన తల్లి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో అక్షయ్ కుమార్ లండన్ లో ‘సిండ్రెల్ల’ మూవీ షూటింగ్‌ నుండి తిరిగి వచ్చారు. అక్షయ్ కుమార్ తల్లి మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

x