మద్యం అక్రమ రవాణా చేసేందుకు కొందరు కేటుగాళ్లు అతితెలివి ప్రదర్శిస్తున్నారు. కృష్ణా జిల్లా వీరులపాడు మండలం పెద్దాపురం చెక్ పోస్ట్ దగ్గర, టూవీలర్ మీద మద్యం తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు.
ఆ బైక్ ను ఎవరైనా చూస్తే వారికీ బండి.. బండి మీద మనిషి మాత్రమే కనిపిస్తాడు. కానీ, మందును తరలించేందుకు ఎవరికి అనుమానం రాకుండా తన బైకును మార్చుకున్నాడు. అతను మార్చుకున్న బైకును చుస్తే ఎవరికి అసలు అనుమానమే రాదు. అయినా, ఆ కేటుగాడు పోలీసుల కళ్ళు కప్ప లేకపోయాడు. బైకును తనిఖీచేసిన పోలీసులు ఒక్కసారిగా కంగు తిన్నారు.
పెట్రోల్ ట్యాంక్ ఉన్నచోట మందు బాటిల్స్ పెట్టుకోవడానికి ప్రత్యేకంగా అరలు ఏర్పాటు చేశాడు. సీటు కింద వరుసగా మద్యం బాటిల్స్ ను పెట్టాడు. మొత్తం తీసి లెక్క పెడితే 34 మద్యం బాటిల్స్ ఉన్నట్లుగా లెక్క తేలాయి. మద్యం సరఫరా చేస్తున్న వ్యక్తిని కేతనకొండ కు చెందిన కోమ్మూరు వెంకటేశ్వర్లు గా గుర్తించారు.