స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి తన కూతురు అల్లు అర్హ అంటే ఎంత ప్రేమో స్పెషల్ గా చెప్పాల్సిన పని లేదు. అల్లు అర్జున్ తన సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లో ఎక్కువగా తన సినిమాల గురించి అప్ డేట్స్ ఇస్తారు. అవి లేకపోతే తన కూతురు, కొడుకు తో కలిసి చేసిన వీడియో లను అప్ డేట్స్ చేస్తారు. ఆ వీడియో లోనూ ఎక్కువగా తన గారాలపట్టి అల్లు అర్హ అప్ డేట్స్ ఎక్కువగా ఉంటాయి.

అల్లు అర్హ చేసే అల్లరి వీడియోలను తన సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లో షేర్ చేస్తూ వాటికీ వచ్చే రెస్పాన్స్ చూసి అల్లు అర్జున్ బాగా ఎంజాయ్ చేస్తారు. అలాంటి అల్లు అర్హ కు తాజాగా ఒక సినిమా ఆఫర్ వచ్చింది. గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్న “శాకుంతలం” సినిమా తో అల్లు అర్హ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు అల్లు అర్జున్ తన సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు.

అల్లు వారి కుటుంబం నుంచి నాల్గవ తరం సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడం పట్ల గర్వంగా ఉందని అల్లుఅర్జున్ ట్వీట్ చేశారు. శాకుంతలం మూవీ తో అల్లు అర్హ సినిమా లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు అల్లు అర్జున్ చెప్పుకొచ్చారు. ఇంతటి చక్కని సినిమా ద్వారా తన కుమార్తె ను వెండితెరకు పరిచయం చేస్తున్నందుకు దర్శకుడు గుణశేఖర్ కు కృతజ్ఞతలు తెలుపుకున్నారు.

ఆ సినిమాలో అల్లు అర్హ చిన్ననాటి భరతుడు పాత్రలో కనిపించనుంది. శకుంతల – దుష్యంతుల కుమారుడు భరతుడు. ఈ సినిమా శకుంతల, దుష్యంతుడి యొక్క ప్రేమ కావ్యంగా తెరకెక్కనుంది. ఈ సినిమాలో హీరోయిన్ సమంత ప్రధాన పాత్ర పోషిస్తోంది. కేరళ యాక్టర్ దేవ్ మోహన్ దుష్యంతుడు పాత్రలో నటించనున్నారు.

ఈ చిత్రం కు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. గుణశేఖర్ కు మరియు బన్నీ కి మధ్య మంచి స్నేహబంధం ఉంది. గతంలో గుణశేఖర్ దర్శకత్వంలో బన్నీ ‘వరుడు’, ‘రుద్రమదేవి’ అనే సినిమాలు చేశారు. ఇక గుణశేఖర్ దర్శకత్వంలో అల్లు అర్హ ఎంట్రీ ఎలా ఉంటుందో చూడాలి.

x