గత ఏడాది వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి జంటగా వచ్చిన ‘ఉప్పెన’ సినిమా సూపర్ హిట్ అందుకుంది. సుకుమార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన బుచ్చిబాబు ఈ సినిమాతో దర్శకుడిగా మంచి పేరు అందుకున్నాడు. దాంతో ఈ డైరెక్టర్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎవరితో ఉంటుంది అనేది ఆసక్తిగా మారింది.

ఈ నేపథ్యంలో పెద్ద హీరో తోనే బుచ్చిబాబు సినిమా ఉంటుందని అనేక వార్తలు వచ్చాయి. ఇప్పటికే బుచ్చిబాబు ఓ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ స్క్రిప్ట్ తో ఎన్టీఆర్ ను మెప్పించారని తెలుస్తుంది. దాంతో ఎన్టీఆర్ తో సినిమా ఫిక్స్ అయిందని అందరు అనుకున్నారు. కానీ, ఇంకా ఈ ప్రాజెక్ట్ పై ఎలాంటి క్లారిటీ లేదనే వార్తలు వినిపిస్తున్నాయి.

ఆ తరువాత బుచ్చి బాబు కోలీవుడ్ హీరో తో సినిమా చేయబోతున్నారని వార్తలు వినిపించాయి. కానీ అవి కూడా పుకార్లు గానే మిగిలిపోయాయి. అయితే, ఇప్పుడు మాత్రం బుచ్చి బాబు నెక్స్ట్ సినిమా ఫైనల్ అయిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు బుచ్చిబాబు ఒక కథ చెప్పినట్లు తెలుస్తోంది.

బుచ్చి బాబు చెప్పిన కథలో ఓ కొత్త పాయింట్ చాలా బాగా నచ్చడంతో అల్లు అర్జున్ ఒకే చెప్పినట్లు తెలుస్తుంది. ఈ సినిమా ఓ లవ్ స్టోరీ అని తెలుస్తోంది. దాంతో కుదిరితే పుష్ప 2 తర్వాత ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకు వెళ్లాలని బన్నీ భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి చూడాలి ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉంది అనేది. అయితే ప్రస్తుతం పుష్ప పార్ట్ 2 లో నటిస్తున్న బన్నీ ఆ తర్వాత బోయపాటి శ్రీను తో ఓ సినిమాను ప్లాన్ చేస్తున్నాడు.

ఆ పైన లైకా ప్రొడక్షన్స్ లో ఓ సినిమా చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పుష్ప 2 తర్వాత బన్నీ ఎవరికీ ఛాన్స్ ఇస్తారు అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గా మారింది. అయితే, ముందుగా బుచ్చిబాబు సినిమా ఎన్టీఆర్ తో ఉంటుందని అనుకున్నారు. కానీ, ఎన్టీఆర్ కొరటాల శివ ప్రాజెక్టు కు కమిట్ అయ్యాడు. దీంతో బుచ్చిబాబు ఎన్టీఆర్ తో సినిమా చేయాలనుకుంటే మరి కొన్నాళ్ళు వేచి చూడాల్సి ఉంటుంది.

x