స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు కొన్ని రోజుల క్రితం కరోనా పాజిటివ్ వచ్చింది. ఏప్రిల్ 28 న అల్లు అర్జున్ తన ట్విట్టర్‌ ద్వారా అందరికీ ఈ విషయాన్ని తెలియచేశాడు. ఈ రోజు, ఆయన ఆరోగ్యం గురించి ఒక విషయం అభిమానులతో పంచుకున్నాడు. తాను బాగా కోలుకుంటున్నాడని, ఇంకా కొన్ని తేలికపాటి లక్షణాలు ఉన్నాయని అల్లు అర్జున్ వెల్లడించాడు. త్వరగా కోలుకోవాలని ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

అల్లు అర్జున్ ఇలా చెప్పుకొచ్చాడు “అందరికీ హలో! నేను చాలా తేలికపాటి లక్షణాలతో ఉన్నాను, బాగా కోలుకుంటున్నాను మరియు ఇందులో ఆందోళన చెందడానికి ఏమీ లేదు. నేను ఇంకా క్వారంటైన్ లో ఉన్నాను. మీరు నా పై చూపిస్తున్న ప్రేమకు మరియు ప్రార్థనలకు చాలా ధన్యవాదాలు. ” అంటూ తన ట్విట్టర్ లో రాశారు.

అయితే అల్లు అర్జున్ తన కుటుంబ సభ్యుల చిత్రాలు, వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంటున్నారు. అల్లు అర్జున్ తన నివాసంలోనే సెల్ఫ్ క్వారంటైన్ లో ఉన్నాడు, కాని అతని భార్య మరియు పిల్లలకు దూరంగా ఉన్నాడు.

అల్లు అర్జున్ ప్రస్తుతం చేస్తున్న సినిమా పుష్పా. పుష్ప సినిమాను సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. రష్మిక ఈ సినిమా లో హీరోయిన్ గా నటించింది. కరోనా కేసులు పెరగడం వల్ల సినిమా షూట్ ఆగిపోయింది. పరిస్థితి సాధారణ స్థితికి చేరుకున్న తర్వాత షూట్ తిరిగి ప్రారంభమవుతుంది.

x