అల్లు అర్జున్ మరియు సుకుమార్ కలయికలో వస్తున్నా మూడవ సినిమా పుష్ప. ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. సినిమా యూనిట్ ఇప్పుడు పుష్పను రెండు భాగాలుగా విడుదల చేయాలనీ ఆలోచిస్తుంది. ఈ సినిమా 13 ఆగస్టు 2021 న తెరపైకి రావాల్సి ఉంది, అయితే కరోనా కారణంగా, మూవీ మేకర్స్ ఈ చిత్రం విడుదల తేదీని వెనక్కి తీసుకువెళ్తున్నారు.

ఈ సినిమా స్క్రిప్ట్‌ను తిరిగి రూపొందించడానికి మరియు ఇప్పటివరకు చేసిన అవుట్‌పుట్‌ను విశ్లేషించడానికి తగినంత సమయం ఉన్నందున, దర్శకుడు సుకుమార్ ఈ చిత్రాన్ని బాహుబలి మరియు కెజిఎఫ్ మాదిరిగానే రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకుంటున్నాడు.

బాహుబలి మరియు కెజిఎఫ్ సినిమాలు రెండు భాగాలుగా విడుదల చేయాలనే ఆలోచన ప్రీ-ప్రొడక్షన్ దశలోనే జరిగింది. ఈ ఆలోచనను అల్లు అర్జున్‌తో చర్చింది మూవీ యూనిట్. మూలాల ప్రకారం, ఈ సినిమా కథకు భారీ వ్యవధి ఉంది దీనితో సుకుమర్ స్క్రిప్ట్‌కు మరింత ఆసక్తికరమైన అంశాలను జోడించడానికి ఒక అవకాశం ఉంది.

సుకుమార్‌తో ఆర్య, ఆర్య 2 చేసిన అల్లు అర్జున్, దర్శకుడి ఆలోచనకు సరే అని చెప్పినట్లు తెలుస్తోంది. విశేషం ఏమిటంటే, అల్లు అర్జున్ తుది నిర్ణయాన్ని సుకుమార్‌కు వదిలిపెట్టాడు. సుకుమార్ మరికొన్ని రోజుల్లో దీనిపై ఒక నిర్ణయానికి రావచ్చు. ప్రతి విషయం ప్రణాళిక ప్రకారం జరిగితే, మొదటి భాగం 2021 మరియు రెండవ భాగం వచ్చే ఏడాది వస్తుంది.

ఫహద్ ఫాసిల్ పుష్ప సినిమాతో తెలుగులో అడుగుపెట్టాడు. ఈ చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్ర సంగీత దర్శకుడు. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

x