ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ మరియు రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ మంచి స్నేహితులన్న విషయం మన అందరికి తెలుసు. దేవిశ్రీప్రసాద్, అల్లు అర్జున్ కోసం అనేక హిట్ ఆల్బమ్స్ ను కంపోజ్ చేశారు. వీరిద్దరూ కలిసి చేసిన సినిమాలు సూపర్ హిట్‌గా నిలిచాయి. తన స్నేహితులకు స్పెషల్‌ గిఫ్ట్‌ ఇచ్చి సర్ ప్రైజ్ చేసే అలవాటు అల్లు అర్జున్ కు ఉంది. తాజాగా అల్లు అర్జున్, రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ కు ఒక సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చి ఆశ్చర్యపరిచాడు.

ఈరోజు ఉదయం దేవి శ్రీ ప్రసాద్, బన్నీ ఇచ్చిన స్పెషల్ గిఫ్ట్ ను సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో పంచుకున్నారు. రాక్ స్టార్ట్ దేవి శ్రీ ప్రసాద్ అనే పేరుతో ఒక లైటింగ్ కలిగిన సైన్ బోర్డును బన్నీ, దేవి శ్రీ ప్రసాద్ కు గిఫ్ట్ గా ఇచ్చారు.

దేవి శ్రీ ప్రసాద్ ఈ విషయాన్ని అభిమానులతో పంచుకుంటూ ఇలా రాశారు. “ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ నుండి సర్‌ప్రైజ్‌ ‘రాక్‌స్టార్‌’ గిఫ్ట్‌. ధన్యవాదాలు మై డియరెస్ట్ బ్రదర్ బన్నీ..అద్భుతమైన బహుమతి నేను అస్సలు ఊహించలేదు” అంటూ దేవిశ్రీ ప్రసాద్ ఆ గిఫ్ట్ కు సంబంధించిన ఒక వీడియోను ట్విటర్‌ ఖాతాలో పోస్ట్ చేశారు.

అల్లు అర్జున్ దేవి శ్రీ ప్రసాద్ ఇద్దరు ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న పుష్ప చిత్రం కోసం పనిచేస్తున్నారు. ఈ సినిమా యొక్క తాజా షెడ్యూల్ కొద్ది రోజుల క్రితం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కనుంది మరియు మొదటి భాగం ఈ సంవత్సరం చివర్లో తెరపైకి రావచ్చు.

x