ఎట్టకేలకు ఈ కామర్స్ దిగ్గజ సంస్థ అమెజాన్ తమ పై వచ్చిన వ్యాఖ్యలు నిజమేనని అంగీకరించింది. ఇటీవల డెమొక్రటిక్ నేత మార్క్ పోకన్, ఈ కామర్స్ దిగ్గజ సంస్థ అమెజాన్ పై ఒక ట్వీట్ చేశారు. అమెజాన్ సిబ్బంది వాటర్ బాటిల్స్ లో మూత్రం పోస్తున్నారని అయన ట్వీట్ చేశారు. అమెజాన్ క్షమాపణ కోరింది, ఆ ట్వీట్ విషయంలో..

ఈ కామర్స్ దిగ్గజ సంస్థ అమెజాన్ తమ సిబ్బంది వాటర్ బాటిల్స్ లో మూత్రం పోయడం నిజమేనని ఒప్పుకుంది. దీనికి సంబంధించి ట్వీట్ చేసిన మార్కు పోకెన్ కు క్షమాపణలు చెప్పండి. అమెజాన్ మాట్లాడుతు, అసలు జరిగిన నిజం ఏమిటో తెలుసుకోకుండా అమెరికా చట్టసభ ప్రతినిధి మాటలను కొట్టిపారేశాము అని పేర్కొంది. గత వారం అమెరికా చట్టసభ ప్రతినిధి మార్కు పోకన్ అమెజాన్ పై ఒక ట్వీట్ చేశారు. అది సోషల్ మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

ఆ ట్విట్ ఏమిటంటే “ఉద్యోగ సంఘాలు లేకుండా చేయడం, మీ డ్రైవర్లు వాటర్ బాటిళ్లలో మూత్రం పోయడం వంటివి ఉన్నంతకాలం.. మీ సిబ్బంది కి గంటకు 15 డాలర్ల ఇచ్చిన, మీది గొప్ప సంస్థ అనిపించుకోదు”అంటూఅమెరికా చట్టసభ ప్రతినిధి మార్కు పోకన్ ట్వీట్ చేశారు. అలబామాలోని అతి పెద్ద అమెజాన్ కేంద్రంలో ఉద్యోగ సంస్థ సంఘాల ఏర్పాటుకు అమెజాన్ వ్యతిరేకత వ్యక్తం చేసిన నేపథ్యంలో లో మార్కు పోకెన్ ఈ విధంగా స్పందించి ట్వీట్ చేశారు.

ఆయన చేసిన ట్వీట్ కు బదులుగా అమెజాన్ ఇంకో ట్వీట్ చేసింది, వాటర్ బాటిల్స్ లో ఎవరైనా మూత్రం పోస్తారా? అలా చేస్తే మా సంస్థలో ఎవరూ ఉద్యోగం చేయరు.. అంటూ ట్వీట్ చేసింది. అమెజాన్ కు సంబంధించిన డెలివరీ బాయ్స్ వాటర్ బాటిల్స్ లో మూత్రం పోస్తున్నారని ఆధారాలతో సహా మీడియా సంస్థలు బయటపెట్టాయి. డెలివర్ బాయ్స్ మాట్లాడుతూ మాకు బాటిల్స్ లో మాత్రం చేయడం తప్ప, ఇంకో మార్గం ఏమి కనిపించలేదు అని, మీడియాకు తమ బాధ చెప్పుకున్నారు. తమ పైన అధికారులకు కూడా దీని గురించి తెలుసని చెప్పారు.

ఈ మొత్తం ఆధారాలు చూసిన తర్వాత ఈ కామర్స్ దిగ్గజ సంస్థ అమెజాన్ కిందకు దిగిరాక తప్పలేదు. మార్క్ పోకెన్ చేసిన ట్వీట్ కు క్షమాపణ చెబుతూ ప్రకటన విడుదల చేసింది. అమెజాన్ ఆ ప్రకటనలో, “మీరు ఫుల్ పింక్ సెంటర్ల గురించి మాట్లాడుతున్నారేమో అని అనుకున్నాము” అందుకే మేము వాటర్ బాటిల్స్ లో ఎవరైనా మూత్రం పోస్తారా అని, మీరు చేసిన ట్వీట్ కు బదులు ఇచ్చాం.

మా సంస్థలో చాలా మంది డ్రైవర్లు ఉన్నారు. వారు వాటర్ బాటిల్స్ లో మూత్రం పోయడం నిజమేనని అని చెప్పింది. మా డ్రైవర్లు అనేక ప్రాంతాలకు వెళ్తుంటారు వెళ్లిన ప్రతిచోట బాత్రూమ్స్ అందుబాటులో ఉండవు కాబట్టి వాళ్లు ఈ పని చేసి ఉంటారని పేర్కొంది. ఇప్పుడు ఉన్న ప్రజెంట్ సిచువేషన్ లో ఈ కరోనా వల్ల ఓపెన్ బాత్రూమ్స్ ను మూసేసారు. దీంతో మా డ్రైవర్స్ వాటర్ బాటిల్స్ లో మూత్రం పోస్తున్నారు అని వివరణ ఇచ్చారు.

అమెజాన్ ఇచ్చిన వివరణ కు మార్క్ పోకన్ అసహనం వ్యక్తం చేశాడు. మీ క్షమాపణలు నాకెందుకు, నేను మాట్లాడేది మీ ఉద్యోగుల గురించి, మీ ఉద్యోగులకు మీరు సరేనా గౌరవం ఇవ్వట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పనిప్రదేశాల్లో వారికి సరైన వసతులు చేకూర్చాలని, ప్రతి ఒక్కరిని సమానంగా చూసుకోవాలని, సంఘాల ఏర్పాటుకు సహకరించాలని ఆయన అమెజాన్ కు చెప్పారు.

x