కొన్ని ఈ-కామర్స్ వెబ్ సైట్స్ అప్పుడప్పుడు పండగ ఆఫర్లు గా ప్రత్యేక సెల్ పేరుతో ప్రొడక్టులను తక్కువ ధరకే అమ్ముతూ ఉంటారు. కానీ ఈసారి ఎటువంటి పండగ లేకుండానే, అమెజాన్ ఈ కామర్స్ వెబ్సైట్ సోమవారం ఒక ప్రత్యేక ఆఫర్ను తీసుకు వచ్చింది. అదేమిటంటే తోషిబా 1.8 టన్నుల 5-స్టార్ ఇన్వర్టర్ ఏసీ. దీని అసలు విలువ 96,000 వేల రూపాయలు కానీ, అమెజాన్ 94 శాతం డిస్కౌంట్లతో దీనిని 5,900 రూపాయలకు తీసుకువచ్చింది.

అమెజాన్ వెబ్ సైట్ లో జరిగిన చిన్న సాంకేతిక లోపం కారణంగా ఈ తోషిబా 1.8 టన్నుల 5-స్టార్ ఏసీ ధర 5,900 రూపాయలకు లిస్టింగ్ అయినట్టు తెలుస్తోంది. ఆసక్తికరంగా, ఈ ఆఫర్ నెలవారీ వాయిదాల్లో రూ .278 మాత్రమే చూపించింది. దీంతో కొంతమంది కస్టమర్లు దీన్ని కొనుగోలు చేసి లాభపడ్డారు. ప్రస్తుతం అమెజాన్ ఆ లోపాన్ని సద్దుబాటు చేసి తోషిబా 1.8 టన్నుల 5-స్టార్ ఇన్వర్టర్ ఏసి ని 59,000 వేల రూపాయలకు అందిస్తుంది.

ఇలా ఇలా తప్పులు జరగడం ఇది తొలిసారి ఏమి కాదు. ఇది తొలిసారి ఏమి కాదు. జూన్ నెలలో ఢిల్లీ కి చెందిన ఒక వ్యక్తి అమెజాన్ వెబ్ సైట్ లో ఒక రిమోట్ కంట్రోల్ కారును బుక్ చేశాడు. కానీ, డెలివరీ సమయంలో పేర్లే-జి బిస్కెట్ రావడంతో అతను ఆశ్చర్యపోయాడు. దీంతో ఆ విషయాన్ని అతను ఫేస్ బుక్ లో పంచుకున్నాడు.

x