తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కల్లాకురుచ్చి సమీపంలోని అలాటర్ గ్రామం వద్ద టైర్ పంచర్ కావడంతో అంబులెన్స్ చెట్టును ఢీకొట్టింది. దీంతో అంబులెన్సు లో డెలివరీ కోసం వెళ్తున్న నిండు గర్భిణి జయలక్ష్మి తో పాటు మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. అత్యంత విషాదకరం ఏమిటంటే జయలక్ష్మి కడుపులోని పసిబిడ్డ కూడా ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనలో మరో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని కల్లాకురుచ్చి ఆస్పత్రికి తరలించారు.

పూడిపట్టి కి చెందిన జయలక్ష్మి నిండు గర్భిణీ అయితే, ఒక్కసారిగా ఆమెకు నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు 108కి ఫోన్ చేశారు. జయలక్ష్మి తో పాటు ఆమె అత్త, అల్లుడు అంబులెన్స్ లో వెళ్లారు. ఇంకాసేపట్లో కల్లాకురుచ్చి ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకునే లోపే ఈ ఘటన జరిగింది. జయలక్ష్మి అక్కడికక్కడే చనిపోగా, ఆమె అత్త మరొకరు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

image source

x