హీరోయిన్ అమీ జాక్సన్ ఎవడు, నవమన్మధుడు, రోబో 2.0 మరియు ఐ వంటి చిత్రాలతో దక్షిణ భారత దేశంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. గత రెండు సంవత్సరాలుగా ఆమె సినిమాలకు దూరంగా ఉంటూ, లండన్లో తన కుటుంబ జీవితాన్ని గడుపుతుంది.

అమీ జాక్సన్ కు ఇంకా వివాహం కాలేదు.. కానీ, ఓ బిడ్డకు జన్మనిచ్చి తల్లి అయ్యింది. అమీ జాక్సన్, జార్జ్ పనాయోటౌతో 2015 నుండి డేటింగ్ లో ఉన్నారు. ఆయన ఒక మల్టీ మిలీయనీర్. వివాహం కాకుండా గర్భం రావడంతో, అమీ జాక్సన్ గర్భవతిగా ఉండగానే 2019లో జార్జ్ పనాయోటౌ ను నిశ్చితార్థం చేసుకుంది.

అదే సంవత్సరంలో అమీ జాక్సన్ ఒక కొడుకుకు జన్మనిచ్చింది. ఈ జంట 2020 లో వివాహం చేసుకోవాలని అనుకున్నారు. కానీ, మహమ్మారి కారణంగా వివాహం వాయిదా పడింది. అయితే, ఇటీవల సోషల్ మీడియాలో వీరిద్దరూ విడిపోయారు అంటూ వార్తలు వస్తున్నాయి.

వివరాల్లోకి వెళితే, ఇటీవల అమీ జాక్సన్ ఇంస్టాగ్రామ్ లో జార్జ్ తో కలిసి ఉన్న ఫొటోస్ అన్నిటిని డిలీట్ చేసింది. దీంతో అమీ జాక్సన్, జార్జ్ తో తన సంబంధాన్ని విరమించుకుంటున్నట్లు అందరు భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వార్తలపై అమీ జాక్సన్ మరియు ఆమె కాబోయే భర్త ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.

x