ఆనందయ్య కరోనా మందు పంపిణీ కి తక్షణమే అనుమతి ఇచ్చేలా ఆదేశాలు జారీ చేయాలంటూ హైకోర్టులో పిటిషన్లు దాఖలు అయ్యాయి. ఈ పిటిషన్లు ఇవాళ ఏపీ హైకోర్టు విచారించ బోతుంది.
ఆనందయ్య కరోనా మందు పంపిణీ చేయాలని దాఖలైన రెండు పిటిషన్లపై ఏపీ హైకోర్టు విచారణకు అనుమతి ఇచ్చింది. ఈ రోజు హైకోర్టు డివిజన్ బెంచ్ విచారణ చేపట్టనుంది కరోనా వల్ల తీవ్ర అస్వస్థతకు గురైన వేలాది మందిని తన ఆయుర్వేద మందు తో నయం చేస్తున్న ఆనందయ్య ముందుకు ఆయుష్, ఐ సి ఎం ఆర్ శాస్త్రీయ తనిఖీలు చేస్తున్న సంగతి తెలిసింది. ఆనందయ్య మందును ఆయుర్వేద మందు గా గుర్తించేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
మరోవైపు ప్రజల అవకాశాన్ని క్యాష్ చేసుకుంటున్నారు కొందరు కేటుగాళ్లు. ఆనందయ్య ఆయుర్వేద మందు పేరు తో నకిలీ మందులు పుట్టుకు వస్తున్నాయి. నకిలీ మందుల తయారీ చేసి అమ్ముతున్న వెంకటేశ్వర్లు అనే వ్యక్తిని అరెస్టు పోలీసులు చేశారు. అతని వద్ద నుంచి నకిలీ మందులను స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిన వెంటనే ఆనందయ్య మందు తయారవుతుందని అప్పటివరకు నకిలీ మందుల భారిన పడవద్దని, జాగ్రత్తగా ఉండాలంటూ నెల్లూరు రూరల్ డి.ఎస్.పి కోరారు.