ఆనందయ్య మందు కు లైన్ క్లియర్ అయింది. సోమవారం నుంచి ఆనందయ్య మందు పంపిణీ కి అధికారులు ఏర్పాట్లు చేయనున్నారు. ఆన్ లైన్ లో మాత్రమే ఈ మందు పంపిణీ జరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ముడిసరుకులు మరియు మూలికల సేకరణకు చాలా సమయం పట్టవచ్చని, దీనితో ఆయన మందు తయారీ కి ఐదు రోజుల సమయం పడుతుందని నెల్లూరు జిల్లా కలెక్టర్ చక్రధర్ చెబుతున్నారు.
మందు పంపిణీ కోసం కాల్ సెంటర్స్ ఏర్పాటు చేస్తున్నామని, అంతే కాదు ఒక మొబైల్ యాప్ ను కూడా ఏర్పాటు చేయనున్నట్లు ఆయన అన్నారు. మరోవైపు కృష్ణ పట్టణానికి మాత్రం ఎవరు రావద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. కృష్ణపట్నం లో మందు తయారు చేయడం తనకు సెంటిమెంట్ అని అధికారులతో ఆనందయ్య చెప్పాడు, అయితే మందు ఎక్కడ తయారు చేయాలో ఇంకా నిర్ణయించుకోలేదు.
ఇక కరోనా థర్డ్ వేవ్ కు కూడా మందు తయారు చేస్తానని, కాకపోతే ఆ థర్డ్ వేవ్ ప్రభావం ఎలా ఉంటుందో పరిశీలించిన తర్వాతే ఆ మందు తయారు చేస్తానని ఆనందయ్య చెబుతున్నాడు.