అల్లు అర్జున్ కథానాయకుడిగా, సుకుమార్ డైరెక్షన్ లో రూపొందుతున్న పాన్ ఇండియా సినిమా పుష్ప. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్, రవి శంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కరోనా రెండవ దశ కారణంగా వాయిదా పడిన షూటింగ్ ను ఈ మంగళవారం హైదరాబాద్ లో ప్రారంభించారు. నిర్విరామంగా 45 రోజులపాటు జరిగే తాజా షెడ్యూల్ తో తొలి భాగం పూర్తి చేయబోతున్నారని సమాచారం.

ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ పుష్ప రాజు గా శక్తివంతమైన పాత్రలో కనిపించనున్నారు. ఆయన పాత్రను పరిచయం చేస్తూ కొద్ది నెలల క్రితం విడుదల చేసిన వీడియో యూట్యూబ్ లో అత్యధిక వ్యూస్ తో కొనసాగుతోంది. ఈ చిత్రం లో రష్మిక మందన హీరోయిన్ గా మరియు మలయాళ నటుడు ఫహాద్‌ ఫాజిల్ విలన్ గా నటిస్తున్నారు.

ఈ సినిమాలో అనసూయ భరధ్వాజ్ ఒక కీలక పాత్ర పోషిస్తుంది. తాజాగా అనసూయ షూటింగ్ లో జాయిన్ అయ్యింది. ఈ విషయాన్ని అనసూయ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా మొదటి భాగం క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ లో విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు.

x