థియేటర్లు మూసివేయడం, మరియు ఒక పక్క ఐపిఎల్ మధ్యలో ఆగిపోవడంతో, ఎంటర్టైన్మెంట్ చాలా దూరమైంది.ఒ.టి.టి ప్లాట్‌ఫారమ్‌లు ప్రస్తుతం ఈ ఖాళీని పూరించడానికి ప్రయత్నిస్తున్నాయి. ‘థ్యాంక్ యు బ్రదర్’ అనే కొత్త తెలుగు సినిమా ఒ.టి.టి ప్లాట్‌ఫామ్‌లో విడుదల అవుతుంది. ఈ చిత్రం మొదట థియేటర్స్ లో రిలీజ్ చేయాలనుకున్నారు, కాని కరోనా సెకండ్ వేవ్ కారణంగా మూవీ మేకర్స్ ఒ.టి.టి ప్లాట్ ఫామ్ ఎంచుకున్నారు. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను ఆహా దక్కించుకుంది. ఆహా ప్లాట్ ఫామ్ ఈ రోజు సినిమాను విడుదల చేస్తుంది. ఇందులో అనసూయ భరద్వాజ్, విరాజ్ అశ్విన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

ఇప్పటికే, ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ మరియు ట్రైలర్ ప్రేక్షకులలో ప్రత్యేక ఆసక్తిని సృష్టించింది. ఈ చిత్రంలో అనసూయ భరద్వాజ్ గర్భవతిగా నటిస్తుంది, ఆమె డెలివరీకి వచ్చినప్పుడు లిఫ్ట్‌లో చిక్కుకుంటుంది. ఫిల్మ్ యూనిట్ విడుదలకు ముందే సినిమాకు ప్రొమోషన్స్ చేసింది. వారు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన కోసం ఎదురుచూస్తున్నారు.

రమేష్ రాపర్తి ఈ సినిమాకి రచయిత మరియు దర్శకుడు. మాగుంట శరత్ చంద్రరెడ్డి, తారక్నాథ్ బొమ్మి రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. సురేష్ ఈ సినిమా ఛాయాగ్రాహకుడు. గుణ బాలసుబ్రమణ్యన్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు.

x