సూపర్ స్టార్ కృష్ణ మనవడు అశోక్ గల్లా ‘హీరో’ అనే చిత్రం తో టాలీవుడ్ కి పరిచయం అవుతున్నాడు. ఈ సినిమా నుంచి వచ్చిన ట్రైలర్ అందరిని ఆకట్టుకుంటుంది. ఈ చిత్రంలో దర్శకుడు అనిల్ రావిపూడి ఒక ప్రత్యేక పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. ఇది అతిధి పాత్ర అయినప్పటికీ మంచి ప్రభావం చూపుతుందని అంటున్నారు.
‘సరిలేరు నీకెవ్వరు’ లో మహేష్ బాబు ను అనిల్ రావిపూడి డైరెక్ట్ చేయగా, అనిల్ రావిపూడి ఇప్పుడు మహేష్ బాబు మేనల్లుడు సినిమాలో అతిథి పాత్ర చేయబోతున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ రోజు జరగనుంది. ఈ వేడుకకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.
ఈ చిత్రంలో అశోక్ గల్లా సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. అమర రాజా మీడియా & ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై శ్రీరామ్ ఆదిత్య ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. సంక్రాంతి కానుకగా ఈ సినిమా జనవరి 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.