విజయ్ సేతుపతి మరియు తాప్సీ పన్ను ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘అనబెల్ సేతుపతి’. దీపక్ సుందర రాజన్ ఈ సినిమాను హారర్, కామెడీ నేపథ్యంలో తెరకెక్కించారు. సుధన్ – జయరామ్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ కు మంచి స్పందన వచ్చింది. అయితే, తాజాగా చిత్ర బృందం ఈ సినిమా యొక్క ట్రైలర్‌ను ఒకేసారి మూడు భాషల్లో రిలీజ్ చేసింది. ఈ ట్రైలర్‌ను తెలుగులో విక్టరి వెంకటేశ్, తమిళంలో సూర్య, మలయాళంలో మోహన్ లాల్ విడుదల చేశారు.
ఇక ట్రైలర్ విషయానికి వస్తే, 1948వ సంవత్సరంలో వీరసేతుపతి అనే రాజు తన ప్రేయసి అనబెల్ కోసం కొంత మంది కళాకారుల తో ఒక రాజ్‌మహాల్ ను నిర్మిస్తారు. కాలక్రమేణా ఆ కళాకారులు మరియు వారి కుటుంబాలు దయ్యాలుగా మరి ఆ రాజభవనంలో చిక్కుకుపోతారు. కట్ చేస్తే, తాప్సీ 2021వ సవంత్సరంలో తన కుటుంబంతో సహా రాజభవనంలోకి అడుగుపెడుతుంది. ఆ దయ్యాలు తాప్సీని అనబెల్ గా గుర్తిస్తాయి. మధ్యలో కొంతమంది రాజ్‌మహాల్ ను సొంతం చేసుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ దయ్యాలు వారిని భయపెడుతూ ఉంటాయి.
హారర్ కామెడీగా ఈ సినిమా తెరకెక్కినట్లు ట్రైలర్ చూస్తుంటే తెలుస్తోంది. ఈ సినిమాలో జగపతిబాబు, రాజేంద్రప్రసాద్, రాధిక, వెన్నెల కిషోర్, సురేఖ వాణి, యోగిబాబు మరియు దేవదర్శిని ముఖ్యమైన పాత్రలను పోషించారు. ఈ సినిమా సెప్టెంబర్ 17వ తేదీన డిస్నీ హాట్ స్టార్ లో ఒకే సారి ఐదు భాషల్లో విడుదల కానుంది.