కరోనా మరోసారి తన దూకుడు చూపిస్తుంది. ఓ వైపు కరోనా కేసులు మరోవైపు థియేటర్స్ ఆక్యుపెన్సీ టెన్షన్లు ఇవన్నీ సినీ పరిశ్రమను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఇది చాలదన్నట్లు ఓ టాప్ హీరో తన సినిమా విడుదలకు ఒక డేట్ ను ఫిక్స్ చేసుకుంటే మరో హీరో అదే డేట్ కు తన సినిమాను రిలీజ్ చేస్తున్నారు. ఈ టైమ్ లో కూడా వారు ఇగో లకు పోతున్నారు. ఇంతకీ ఆ హీరో ఎవరో తెలుసా.. ఆ హీరో ఏ పెద్ద హీరో ని టార్గెట్ చేస్తున్నాడో తెలుసా..

మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య సినిమా ఫిబ్రవరి 4న విడుదల చేయబోతున్నట్లు మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. కానీ, సినిమా ప్రమోషన్ విషయంలో మాత్రం ఎలాంటి జోరు కనిపించటంలేదు. ఇదిలా ఉంటే హీరో రాజశేఖర్ నటించిన “శేఖర్” చిత్రం కూడా ఫిబ్రవరి 4న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

స్క్రీన్ వెనుక చిరు కు రాజశేఖర్ కు మధ్య చాలా గొడవలు ఉన్నాయి. ఈ విషయం పరిశ్రమ తాలూకా ఈవెంట్స్ మరియు ఫంక్షన్స్ లో ఓపెన్గానే బయటపడ్డాయి. పెద్దల జోక్యంతో అవన్నీ ఎప్పటికప్పుడు సర్దుకుంటూ వచ్చాయి. కానీ, ఇలాంటి టైమ్ లో అలాంటి వైరాలు ఉంటాయని ఎవరూ ఊహించరు.

రాజశేఖర్ ఫిబ్రవరి 4న తన సినిమా ‘శేఖర్’ ను రిలీజ్ చేయడం ద్వారా ఆచార్య కు పోటీ ఇవ్వలేక పోయినప్పటికీ కనీసం ఉచిత ప్రచారాన్ని అందుకుంటారని కొంతమంది అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. అయితే, ఇక్కడ ఆచార్య మేకర్స్ మాత్రం ఎలాంటి హడావిడి చేయట్లేదు. బహుశా చివరి నిమిషంలో ఆచార్య సినిమాను వాయిదా వేసిన ఆశ్చర్యపోనవసరం లేదు. బహుశా ఆ కారణంతోనే రాజశేఖర్ ఎంత హడావిడి చేసిన చిరంజీవి పట్టించుకోవడం లేదు.

x