భార‌త్‌లో జాన్సన్ అండ్ జాన్సన్ సింగల్ డోసు టీకాకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అమెరికాకు చెందిన ఈ సింగల్ డోసు టీకాను అత్యవసర వినియోగానికి కేంద్రం అనుమ‌తులు ఇచ్చింది. త్వరలో జాన్సన్ అండ్ జాన్సన్ టీకా అందుబాటులోకి రానుంది. ఈ టీకా తో కలిపి మొత్తం మన భారతదేశంలో ఐదు వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. యురోపియ‌న్ యూనియ‌న్ ఏజెన్సీ చేత ఆమోదం పొందిన ఐదు టీకాలు ప్రస్తుతం మనదగ్గర ఉన్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ట్విట్ట‌ర్‌లో తెలిపారు. కరోనాపై పోరాటం చేయడానికి ఈ వ్యాక్సిన్లు మరింత దోహదపడతాయని ఆయన చెప్పారు.

x