కోవిడ్ కారణంగా అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. సినీ ఇండస్ట్రీ లో కూడా చాలా మంది ప్రముఖులు ఈ కరోనా వల్ల కన్నుమూశారు. మొన్న దీని వల్ల నటుడు, సినీ జర్నలిస్ట్ TNR గారు మృతి చెందాడు. ఇంతలోనే మరో టాలీవుడ్ దర్శకుడు మరియు రచయితా నంద్యల రవి ఈ కరోనా తో పోరాడి చనిపోయాడు. గత కొన్ని రోజులుగా కరోనాతో పోరాడుతున్న ఆయన ఈ రోజు ఉదయం ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు.

కరోనా తో హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న ఆయనకు ఆర్థిక ఇబ్బందులు ఉండటంతో నటుడు సప్తగిరి లక్ష రుపాయలు సాయం చేశాడు. కరోనా క్రైసిస్‌ ఛారిటీ నుంచి కూడా కొంత సాయం అందింది, అయినా కూడా ఆయన కరోనా నుంచి కోలుకోలేకపోయాడు.

రవి డైలాగ్ రైటర్‌గా పలు చిత్రాలకు పనిచేశాడు. 2014 లో నాగ శౌర్య, అవికా గోర్ ప్రధాన పాత్రల్లో నటించిన “లక్ష్మి రావే మా ఇంటికి” సినిమా తో దర్శకుడిగా ప్రయాణం మొదలు పెట్టాడు. అతను రాజ్ తరుణ్ యొక్క ఒరే బుజ్జిగా సినిమాకు రచయితగా పనిచేశాడు. ఈ మధ్య కాలంలో వచ్చిన ‘పవర్‌ ప్లే’ సినిమాకు ఆయన స్క్రిప్ట్‌ రైటర్‌గా పని చేశాడు. ఆయన మరణానికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

x